పాజిటీవ్ వైబ్రేషన్స్ తో మిస్ మ్యాచ్ ప్రేక్షకుల ముందుకు !!!


పాజిటీవ్  వైబ్రేషన్స్ తో మిస్ మ్యాచ్ ప్రేక్షకుల ముందుకు !!!
పాజిటీవ్ వైబ్రేషన్స్ తో మిస్ మ్యాచ్ ప్రేక్షకుల ముందుకు !!!

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న’మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న ‘మిస్ మ్యాచ్‘ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఈ సినిమా రెండు కుటుంభాల మధ్య జరిగే కథ. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యూత్ ఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమాలో ఉండబోటిందని తెలిస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన కొందరు సినీ జనాలు సినిమా బాగుందని చెబుతున్నారు. ఆటకథరా శివ సినిమాతో మెప్పించిన హీరో ఉదయ్ ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. కుటుంభం అంతా కలసి ఈ సినిమాను చూడొచ్చని సెన్సార్ సభ్యులు క్లీన్ యు సట్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.