`మిస్ ఇండియా` కాపీ స్టోరీనా?

`మిస్ ఇండియా` కాపీ స్టోరీనా?
`మిస్ ఇండియా` కాపీ స్టోరీనా?

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం `మిస్ ఇండియా`. న‌రేంద్ర‌నాథ్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఛాయ్ వ‌‌ర్సెస్ కాఫీ గేమ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవ‌లే ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. టిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లో ఈ మూవీకి దారుణమైన స్పంద‌న ఎదురైంది. ఆశించిన స్థాయిలో సినిమా లేక‌పోవ‌డం, ప‌బ్లిసిటీ కూడా పెద్ద‌గ లేక‌పోవ‌డం కంటే మేక‌ర్స్ అండ్ హిస్ టీమ్ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఈ మూవీ ఫ‌లితంగా బొక్క‌బోర్లా ప‌డింది.

అయితే తాజాగా ఈ సినిమా క‌థ కాపీ అని తెలుస్తోంది. ఓ సాధార‌ణ యువ‌తి అమెరికాలో ఛాయ్ బిజినెస్‌ని ప్రారంభించి ఏ స్థాయికి ఎదిగింది అన్న‌ది `మిస్ ఇండియా` మెయిన్ స్టోరీ. ఈ క‌థ ఓ అమెరిక‌న్ యువ‌తిద‌ని, ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈ క‌థ‌ని తెర‌పైకి తీసుకొచ్చార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇండియ‌న్ ఛాయ్‌ని భ‌క్తి ఛాయ్ పేరుతో ఓ అమెరిక‌న్ యువ‌తి దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది.

ఆమె పేరు బ్రూక్ ఎడ్డీ. నార్త్ ఇండియా అంతా ట్రావెల్ చేసిన ఆమె ఛాయ్ అంటే మోజుప‌డింది. దాన్నే త‌న బిజినెస్‌గా మార్చుకుని అమెరికాలో 2018 వ‌ర‌కు 35 మిలియ‌న్‌లు సంపాదించి ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. 2007లో ఛాయ్ బిజినెస్‌ని ప్రారంభించి దాదాపు ప‌ద‌కొండేళ్ల‌లోనే అత్యున్న‌త స్థాయికి చేరింది. అదే స్టోరీని అటు ఇటుగా మార్చి `మిస్ ఇండియా` అంటూ నానా హంగామా చేశారు. మేకింగ్‌, టేకింగ్‌ల‌లో దొర్లిన త‌ప్పులే ఈ మూవీ ప‌రాజ‌యానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచాయి. కాపీ క‌థ‌తో సినిమా చేశార‌ని తెలియ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు.