నితిన్ కోసం మిస్ తెలంగాణ దిగుతోంది


నితిన్ కోసం మిస్ తెలంగాణ దిగుతోంది
నితిన్ కోసం మిస్ తెలంగాణ దిగుతోంది

ఈమధ్య ప్లాపులతో నితిన్ బాగా డల్ అయిపోయాడు. వారసగా రెండు, మూడు పరాజయాలు పలకరించడంతో సినిమాల నుండి కొంచెం గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఒకవైపు ఛలో సినిమాను తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

దీని తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా షూటింగ్ లో పాల్గొనాలి. దాని తర్వాత కూడా టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక చిత్రం చేయాలి. ఇలా ఒక ఏడాది దాకా నితిన్ ఫుల్ బిజీగా గడపనున్నాడు. చంద్రశేఖర్ యేలేటి చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.

ఈ సినిమాలో హీరోయిన్ ను ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురు హీరోయిన్లను పరిశీలించినప్పటికీ మిస్ తెలంగాణగా ఎంపికైన సిమ్రాన్ చౌదరి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. లాస్ట్ ఇయర్ విడుదలైన ఈ నగరానికి ఏమైంది చిత్రంలో ఈ భామ ఒక కీలక పాత్ర పోషించింది. డిసెంబర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.