కంగనా పై విమర్శలు చేసిన నితిన్ హీరోయిన్

Misthi Chakraborty fires on kangana ranautమణికర్ణిక చిత్రంలో నాపై చిత్రీకరించిన సన్నివేశాలను కుదించడమే కాకుండా , క్రిష్ పై తప్పుడు ఆరోపణలు చేసిన కంగనా రనౌత్ అసలు డైరెక్టర్ ఎలా అవుతుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది నితిన్ హీరోయిన్ మిస్తీ చక్రవర్తి . తెలుగులో నితిన్ నటించిన చిన్నదానా నీకోసం చిత్రంలో నటించిన భామ ఈ మిస్తీ చక్రవర్తి . బాలీవుడ్ నటి అయిన మిస్తీ చక్రవర్తి మణికర్ణిక చిత్రంలో నటించింది.

 

 

అయితే క్రిష్ దర్శకత్వంలో పలు సన్నివేశాల్లో నటించానని , అయితే క్రిష్ డైరెక్టర్ గా తప్పుకోవడంతో కంగనా రనౌత్ తో పాటుగా ఆ చిత్ర సహా నిర్మాత నా పాత్ర ని మరింతగా పెద్దదిగా చేస్తున్నామని చెప్పి కొన్ని సన్నివేశాలు మళ్ళీ చిత్రీకరించారని , ఎక్కువ నిడివి అని చెప్పి తీరా సినిమాలో అందరి పాత్రలను తక్కువచేసి తన పాత్రని మాత్రం ఎక్కువగా చూపించుకుందని కంగనా పై విమర్శలు చేసింది . అంతేకాదు డైరెక్టర్ అంటే సినిమాలో అన్ని పాత్రలను బాగా వచ్చేలా చూసుకుంటారు కానీ ఒక్క పాత్ర ని మాత్రమే హైలెట్ అయ్యేలా చూడరని కాబట్టి కంగనా అసలు డైరెక్టర్ కానే కాదని అంటోంది . ఈ విమర్శలపై కంగనా రనౌత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

English Title: Misthi Chakraborty fires on kangana ranaut