యాదవ రెడ్డి ని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్


MLC Yadava reddy suspension from TRS

ఎం ఎల్ సి యాదవ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ సమక్షంలో చేరనున్నాడు అన్న పక్కా సమాచారంతో సస్పెండ్ చేశారు టీఆర్ఎస్ అధిష్టానం. ఎం ఎల్ సి యాదవ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాడు ఇంత కాలంగా . కానీ 2014 లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడంతో ఆ పార్టీ ని వీడి టీఆర్ఎస్ లో చేరాడు. అయితే గత కొంత కాలంగా కేసీఆర్ పట్ల అసంతృప్తితో ఉన్న యాదవ్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఈరోజు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు.

అయితే కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లుగా టీఆర్ఎస్ కు పక్క సమాచారం అందడంతో వెంటనే సస్పెండ్ చేసింది. ఈరోజు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేయగా ఇప్పుడు యాదవ రెడ్డి కూడా కెసిఆర్ కు ఝలక్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఇంకా పలువురు ఉన్నట్లే ! కేసీఆర్ కు ఝలక్ ఇచ్చేవాళ్ళు.

English Title: MLC Yadava reddy suspension from TRS