ఆర్ ఆర్ ఆర్ బ్యాక్ డ్రాప్ రివీల్ చేసిన కీరవాణి


MM Keeravani revelas RRR movie backdrop
MM Keeravani

ఎన్టీఆర్ , రాంచరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ఏ నేపథ్యంలో రూపొందుతోందో సరిగ్గా రివీల్ చేయలేదు కానీ ఆ చిత్ర సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి మాత్రం ఆర్ ఆర్ ఆర్ బ్యాక్ డ్రాప్ ని రివీల్ చేసాడు . ఆర్ ఆర్ ఆర్ చిత్రం పీరియాడిక్ డ్రామాగా అభివర్ణించాడు . ఆర్ ఆర్ ఆర్ చిత్రం  గురించి మాట్లాడిన కీరవాణి ” పీరియాడిక్ , ట్రెండీ ల ఫ్యూజన్ నేపథ్యంలో సంగీతం ఇవ్వబోతున్నానని స్పష్టం చేసాడు . అంటే ఈ సినిమా రెండు పార్శ్వాలుగా స్వాతంత్యానికి ముందు , ఇప్పటి పరిస్థితుల నేపథ్యం అని తెలుస్తోంది కీరవాణి మాటలను బట్టి .

ఎన్టీఆర్ , చరణ్ లు మళ్ళీ మళ్ళీ జన్మించే సన్నివేశాలు ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి అని తెలుస్తోంది . ఇక ఈ సినిమా కోసం మార్చి నుండి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చోనున్నాడట కీరవాణి , ఎస్ ఎస్ రాజమౌళి . ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఆర్ ఆర్ ఆర్ రెండో షెడ్యూల్ ఈనెల 18 నుండి జరుగనున్నట్లు తెలుస్తోంది .

English Title: MM Keeravani revelas RRR movie backdrop