“స్టేట్ రౌడీ” కోసం “అసెంబ్లీ రౌడీ” న్యూ లుక్


Mohan babu as villain in Chiru – koratala movie
Mohan babu as villain in Chiru – koratala movie

భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో మొదట విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంటర్ అయి, ఆ తర్వాత సూపర్ హీరోలు అయిన వారి జాబితాలో సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి మరియు విలక్షణ నటుడు మోహన్ బాబు ఇలా అనేక మంది ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఒక హీరోగా మరొకరు విలన్ గా సినిమాలు చేయడం సాధ్యమే, కానీ వారికి సొంత గుర్తింపు మరియు ఇమేజ్ వచ్చాక అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్కరు మరొక సినిమాలో విలన్ గా లేదంటే సదరు హీరో కన్నా తక్కువ పాత్రలో చేయడం సాధ్యం కాదు.అయితే బాలీవుడ్ లో మొదలుపెట్టి ప్రస్తుతం ఈ ట్రెండ్ నెమ్మదినెమ్మదిగా మారుతోంది. తమిళంలో అయితే హీరోగా చేస్తున్న విజయ్ సేతుపతి అవకాశం వచ్చినప్పుడల్లా విలన్ గా కూడా మెరుపులు మెరిస్తున్నాడు. ఇప్పుడు పాయింట్ కొస్తే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు – చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో విలన్ గా నటిస్తున్నారు అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు.

ఈ సినిమాకు “ఆచార్య” అనే టైటిల్ కూడా ఫైనల్ చేశారట. త్రిష హీరోయిన్. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారని సమాచారం. అయితే ఒక ముఖ్యమైన పాత్ర కోసం కొరటాల శివ రీసెంట్ గా మోహన్ బాబు గారిని కలిశారని, దానికి ఎంతో సంతోషంగా మోహన్ బాబు గారు అంగీకరించారని తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న మోహన్ బాబు న్యూ లుక్ కూడా చిరంజీవిగారి సినిమా కు సంబంధించింది అని కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా చిరంజీవి మోహన్ బాబు కాంబినేషన్ లో “బిల్లా రంగా”, “పట్నం వచ్చిన పతివ్రతలు” సినిమాలు విడుదలయ్యాయి. మంచి విజయాన్ని సాధించాయి. అంతే కాకుండా ఆ తర్వాత చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల్లో మోహన్ బాబు విలన్ గా నటించారు. ఒక వేళ చిరంజీవి కొరటాల శివ సినిమాలో కనక మోహన్ బాబు ది విలన్ రోల్ అయితే, వెండి తెరకు అసలైన నిండుతనం వస్తుంది.  లేదా కథలో ఒక కీలకమైన పాత్ర అయినా మోహన్ బాబు చిరంజీవి కాంబినేషన్ అంటే కూడా అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు.