పెద్దల మాటలు గౌరవించండి : మోహన్ బాబుMohan babu awareness video on corona virus
Mohan babu awareness video on corona virus

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ పాటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా ప్రముఖులు మరియు అనేకమంది మేధావులు ఈ కరోనా వైరస్ పై అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా వేదికగా పలు సందేశాలు విడుదల చేస్తున్నారు. దానిలో భాగంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు కూడా తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. పెద్దల మాటలు గౌరవించకపోతే పర్యవసానం ఎలా ఉంటుందో.? ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలని… మన సంస్కృతిని ఆచార వ్యవహారాలను పెద్దలు చెప్పిన మాటలను గౌరవించాలని.. ఈ సందర్భంగా మోహన్ బాబు హితవు పలికారు.

దీనికి ఉదాహరణగా రామాయణంలో వాలి సుగ్రీవుల యుద్ధం కథను అదేవిధంగా లక్ష్మణుడు చెప్పిన మాట వినకుండా సీతమ్మవారు గీత దాటి ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేశారు. “ప్రస్తుతం ఎంతో మంది డాక్టర్లు,ఆరోగ్య వైద్య శాఖ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ వారు ప్రత్యక్షంగా పోరాటం చేస్తూ తమ జీవితాలను మనకోసం రిస్క్ చేస్తున్నారని వారి త్యాగాలను అర్థం చేసుకోవాలని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం 21 రోజుల పాటు లాక్ డౌన్ పాటించాలని, బాధ్యతారహితంగా బయట తిరగవద్దు.!” అని మోహన్ బాబు మరోసారి విజ్ఞప్తి చేశారు.