కెప్టెన్ భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు!


కెప్టెన్ భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు!
కెప్టెన్ భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు!

సూర్య హీరోగా న‌టిస్తున్నత‌మిళ చిత్రం `సూర‌రాయి పోట్రు`. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, శిఖ్యా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై గునీత్ మోంగాతో క‌లిసి హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` పేరుతో రిలీజ్ కాబోతోంది. ఏయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ జి.ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

గ‌త కొంత కాలంగా సెలెక్టీవ్‌గా మాత్ర‌మే సినిమాలు చేస్తూ వ‌స్తున్న క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఈ చిత్రంలోని ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ ఆయ‌న వాయిస్‌తోనే రిలీజ్ కావ‌డంతో మోహ‌న్‌బాబు క్యారెక్ట‌ర్‌కు ఈ సినిమాలో ఎంత ప్రాధాన్య‌త వుందో అర్థ‌మ‌వుతోంది. ఇందులో మోహ‌న్‌బాబు భ‌క్త వ‌త్స‌లం నాయుడు అనే పాత్ర‌లో సీనియ‌ర్ ఏయిర్ ఫోర్స్ అధికారిగా న‌టిస్తున్నారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ చిత్ర బృందం మోహ‌న్‌బాబు లుక్‌ని శుక్ర‌వారం విడుద‌ల చేసింది.

ఇందులో విశేషం ఏంటంటే మోహ‌న్‌బాబు అస‌లు పేరు కూడా భ‌క్త‌వ‌త్స‌లం నాయుడే. ఆయ‌న సినిమాల్లోకి వ‌చ్చాక స్వ‌ర్గీయ‌ దాస‌రి నారాయ‌ణ‌రావు `స్వ‌ర్గం న‌ర‌కం` సినిమాతో ఆయ‌న పేరుని మోహ‌న్‌బాబుగా మార్చారు. తాజా చిత్రంలో మోహ‌న్‌బాబు పాత్ర హీరో సూర్య‌కు గురువుగా మార్గ‌నిర్దేశ‌కుడిగా వుంటుంద‌ని, వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చిత్రానికి హైలైట్గా నిలుస్తాయ‌ని, త‌మిళ వెర్ష‌న్‌లోనూ మోహ‌న్‌బాబు త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకున్నార‌ని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో హీరో సూర్య‌కు జోడీగా అప‌ర్ణా బాల‌ముర‌ళి న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌ల్లో జాకీష్రాఫ్‌, ప‌రేష్ రావ‌ల్ న‌టిస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.