క‌లెక్ష‌న్‌కింగ్ మ‌ళ్లీ విల‌న్‌గా న‌టిస్తున్నారా?


క‌లెక్ష‌న్‌కింగ్ మ‌ళ్లీ విల‌న్‌గా న‌టిస్తున్నారా?
క‌లెక్ష‌న్‌కింగ్ మ‌ళ్లీ విల‌న్‌గా న‌టిస్తున్నారా?

క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు.. వెండితెర‌పై విల‌న్ పాత్ర‌ల‌కు వ‌న్నె తెచ్చిన హీరో. కెరీర్ తొలినాళ్ల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా త‌న‌దైన ముద్ర వేశారు. విల‌నిజానికి, విల‌న్ డైలాగ్ డెలివ‌రీకి కొత్త భాష్యం చెప్పిన మోహ‌న్‌ బాబు ఆ త‌రువాత హీరోగా ట‌ర్న్ అయిన విష‌యం తెలిసిందే. హీరోగా మార‌డానికి ముందు ఆయ‌న మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి చేసిన చిత్రాలు మంచి విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. కిర‌యి రౌడీలు, చ‌ట్టానికి క‌ళ్లు లేవు, కొండ వీటి దొంగ‌, కొండ‌వీటి రాజా, కొద‌మ సింహం, లంకేశ్వ‌రుడు, మంచి దొంగ‌, చ‌క్ర‌వ‌ర్తి.. ఇలా చాలా చిత్రాల్లో హీరో, విల‌న్‌గా న‌టించారు.

ఇన్నేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ ఈ ఇద్ద‌రు క‌లిసి న‌టించ‌బోతున్నారా? అంటే ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. `సైరా న‌ర‌సింహారెడ్డి ` చిత్రం త‌రువాత మెగాస్టార్ చిరంజీవి మ‌రో చిత్రాన్ని లైన్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కోకా పేట్‌లో కీల‌క స‌న్నివేశాల్ని త్వ‌ర‌లో చిత్రీక‌రించ‌బోతున్నారు. అయితే ఈ సినిమాలో ప్ర‌ధాన విల‌న్ పాత్ర కోసం కొర‌టాల శివ హీరో, క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్ బాబుని అనుకుంటున్నార‌ట‌.

త్వ‌ర‌లోనే ఆయ‌న‌ను ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సంప్ర‌దించాల‌ని చూస్తున్నార‌ట‌. మోహ‌న్‌బాబు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేస్తే చిరు 152 సంథిగ్ స్పెష‌ల్ మూవీగా నిల‌వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. `జ‌న‌తా గ్యారేజ్‌` కోసం మోహ‌న్‌లాల్‌ని కీల‌క పాత్ర కోసం ఒప్పించిన కొర‌టాల ఖ‌చ్చితంగా మోహ‌న్‌బాబుని ఒప్పిస్తాడ‌ని, మోహ‌న్‌బాబు కూడా ఈ మ‌ధ్య చిరుతో క‌లిసిపోయార‌ని, దాంతో ఆయ‌న ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టించే అవ‌కాశాలే ఎక్కువగా క‌నిపిస్తున్నాయ‌నితాజా టాక్‌.