గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం నా మనసును కలచివేసింది. – డా.మంచు మోహన్ బాబు


తిరుపతిలో చదువుకునే రోజుల్లో నేనూ, ఆయన ఒకే రూమ్ లో  ఉండేవాళ్ళం. ఆయన బ్రదర్ నా క్లాస్ మేట్. నాకు అత్యంత సన్నిహితుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఎలక్షన్స్ టైం లో ఆయన తరపున ఎన్నోసార్లు ప్రచారానికి కూడా వెళ్ళాను. అలాంటి మిత్రుడి హఠాన్మరణం నా మనసును కలచి వేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు ఆ శిరిడి సాయినాధుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.