మోహన్ బాబు జగన్ పార్టీలో చేరనున్నాడా ?


Mohan babu contest from tirupati on jagan party

మంచు మోహన్ బాబు జగన్ పార్టీలో చేరనున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి పరిస్థితులు . గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మోహన్ బాబు మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్నాడు , అంతేకాదు తెలుగుదేశం పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆరేళ్ళు పదవి అనుభవించాడు . అయితే చంద్రబాబుతో వచ్చిన విభేదాలతో తెలుగుదేశం పార్టీని వీడాడు .

 

ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసాడు కానీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు అలాగే రాజకీయ పార్టీని కూడా పెట్టాలని చూసాడు కుదరలేదు దాంతో సైలెంట్ అయిపోయాడు కట్ చేస్తే జగన్ తో బంధుత్వం ఉంది దానితో పాటుగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదు కాబట్టి జగన్ పార్టీలో చేరి అసెంబ్లీ కి తిరుపతి నుండి పోటీ చేయాలనీ భావిస్తున్నాడట . మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కి ఎన్నికలు జరుగనున్నందున జగన్ పార్టీలో మోహన్ బాబు చేరడం ఖాయమని తెలుస్తోంది .

English Title: Mohan babu contest from tirupati on jagan party