చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు


Mohan babu demands chandrababu fee reimbursement

మంచు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఆగ్రహం వ్యక్తం చేసాడు . ఫీజు రీ ఎంబర్స్ మెంట్ తక్షణం విడుదల చేయకపోతే మరింత ఆందోళన చేస్తానని హెచ్చరికలు జారీ చేసాడు మోహన్ బాబు . 2014 – 2018 వరకు ఒక్క మా విద్యానికేతన్ కళాశాలకు 19 కోట్ల బకాయిలు రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి . మా కళాశాల ఎలాంటిదో చంద్రబాబుకు బాగా తెలుసు , ఇక్కడికి పలుమార్లు వచ్చాడు కూడా .

 

అలాగే నేను ఏ పార్టీకి చెందినవాడ్ని కాదు అయినా మాకు బకాయిలు చెల్లించడం లేదు . చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకో లేదంటే మా ఆందోళన తీవ్రతరం చేస్తాం అంటూ స్టూడెంట్స్ ని ఉద్దేశించి మాట్లాడాడు మోహన్ బాబు . గతంలో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అయితే చంద్రబాబు నాయుడు తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీని వీడాడు .