మోహన్ బాబు కి ఇంతకీ పదవి వస్తుందా ? లేదా ?


Mohan babu
Mohan babu

వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది మొదలు మోహన్ బాబు కి ఏదో ఒక పదవి వస్తుందని రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి . అయితే రకరకాల పదవులు పేర్లు వినిపించడం అవి వేరే వాళ్ళని వరిస్తుండటంతో మోహన్ బాబు ని అభిమానించే వాళ్ళు అసలు మోహన్ బాబు కి పదవి వస్తుందా ? లేదా ? అన్న నిరాశలో ఉన్నారు

జగన్ ముఖ్యమంత్రి కాగానే ఏదైనా మంత్రిపదవి వస్తుందని అన్నారు , కానీ అది రాలేదు . తర్వాత టిటిడి చైర్మన్ పదవి అని వినిపించింది అది కూడా ఎవరో ఎత్తుకెళ్లారు . కట్ చేస్తే ఇప్పుడేమో ఎఫ్ డి సి చైర్మన్ పదవి అని వినిపిస్తోంది అయితే అది ఇంకా స్ప్రెడ్ కాకముందే ఖండించాలని భావించిన మోహన్ బాబు అవన్నీ ఉట్టి వార్తలే అని అనిపించాడు . మోహన్ బాబు జగన్ కు బంధుత్వం కూడా ఉంది అలాగైనా సరే ఏదైనా పదవి వస్తుందని అనుకుంటున్నారు మోహన్ బాబు అభిమానులు . కానీ అది కనుచూపు మేరలో కనిపించడం లేదు మరి