చిరు సినిమాలో మోహన్ బాబు లుక్ ఇదేనా?


 

Mohan Babu look in chiru 152
Mohan Babu look in chiru 152

చిరంజీవి, మోహన్ బాబు మధ్య అనుబంధం గురించి తెలుగు వారు ఎవరిని అడిగినా చెబుతారు. వారిదొక వింత అనుబంధం. అంతలోనే కొట్టుకుంటారు, అంతలోనే కలిసిపోతారు. స్టేజ్ మీద ఒకరిని ఒకరు వేళాకోలం చేసుకున్న సందర్భాలు అనేకం. రీసెంట్ గా జరిగిన మా మీటింగ్ లో చిరు, మోహన్ బాబు ఎంత సాన్నిహిత్యంగా ఉన్నారో మనందరం చూసాం. మోహన్ బాబు చిరంజీవి గురించి మాట్లాడుతుంటే చిరు వెనక నుండి గట్టిగా మోహన్ బాబును వాటేసుకున్నారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి, మోహన్ బాబు మళ్ళీ చాలా క్లోజ్ గా ఉంటున్నారన్న విషయం అర్ధమైంది.

అయితే గత కొన్ని రోజులుగా చిరంజీవి సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారంటూ ఒక న్యూస్ తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన మోహన్ బాబు, చిరంజీవి సినిమాలో విలన్ అంటే అందరూ చాలా ఆసక్తి చూపించారు. ఈ వార్త అధికారికంగా బయటకు రాకపోయినా అందరూ నిజమనే దీన్ని నమ్ముతున్నారు. దీనికి మరింత బలం చేకూర్చినట్లుగా రీసెంట్ గా మోహన్ బాబుకు జరిగిన ఒక ఫోటోషూట్ కు సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెడలో చాలా గొలుసులతో మోహన్ బాబు లుక్ అదిరిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఈ లుక్ చిరంజీవి సినిమాలో విలన్ పాత్ర కోసమేనంటూ మరో వార్త బయల్దేరింది.

మరి ఈ లుక్ దానికోసమేనా, లేక వేరే సినిమా కోసమా అంటే ఇప్పుడు మోహన్ బాబు చేతిలో సినిమాలేం లేవు. సూర్య సినిమా ఆకాశం నీ హద్దురా లో తన పాత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అందుకని చిరు సినిమా కోసమేనని అనుకోవాలేమో. ఏదేమైనా దీనిపై ఒక అధికారిక ప్రకటన త్వరగా వస్తే బాగుంటుంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరు 152 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెల్సిందే.