కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ”సన్నాఫ్  ఇండియా’!కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ''సన్నాఫ్  ఇండియా'!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ”సన్నాఫ్  ఇండియా’!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా రోజుల తరువాత మళ్ళీ కెమెరా ముందుకొస్తున్నారు. ‘గాయత్రి’ మూవీ తరువాత సోలోగా సినిమా చేయని ఆయన మళ్ళీ  కొత్త సినిమాతో సిద్ధమవుతున్నారు. పొలిటికల్ సెటైరికల్ చిత్రాలకు ఒక దశలో కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మోహన్ బాబు మళ్ళీ అదే పంథా లో ఓ సినిమాకు శ్రీకారం చుట్టారు.

మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్నాఫ్  ఇండియా’!  సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ , 24 ఫ్రెమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుంన్నాయి.
శుక్రవారం ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రకటించారు. ఈ సందర్భంగా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.  ”సన్నాఫ్  ఇండియా”గా మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాల్ని త్వరలో  వెల్లడించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.