క‌లెక్ష‌న్‌కింగ్‌పై అది రూమ‌రేనా?


క‌లెక్ష‌న్‌కింగ్‌పై అది రూమ‌రేనా?
క‌లెక్ష‌న్‌కింగ్‌పై అది రూమ‌రేనా?

మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా రూపొందిన చిత్రం `మ‌హాన‌టి`. ఇందులో ఎస్వీరంగారావు పాత్ర‌లో క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు న‌టించిన విష‌యం తెలిసిందే. పాత్ర చిన్న‌దే అయినా ప్రాముఖ్య‌త వున్న‌ది కావ‌డంతో `మ‌హాన‌టి`లో న‌టించారు మోహ‌న్‌బాబు. అయితే ఆ త‌రువాత నుంచి ఆయ‌న‌కు అదే త‌ర‌హా పాత్ర‌ల్ని ద‌ర్శ‌కులు ఆఫ‌ర్ చేస్తున్నారు. సూర్య హీరోగా న‌టిస్తున్న `ఆకాశ‌ము నీ హ‌ద్దురా` చిత్రంలోనూ మోహ‌న్‌బాబు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

తాజాగా ఆయ‌న మళ్లీ విల‌న్‌గా న‌టించ‌బోతున్నారంటూ ఇటీవ‌ల వార్త‌లు షికారు చేశాయి. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే.
నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి హీరో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం కోకాపేట్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం భారీ విలేజ్ సెట్‌ని నిర్మించారు. అక్క‌డే కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.

ఇందులో విల‌న్‌గా క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు న‌టిస్తార‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అందులో ఎలాంటి నిజం లేద‌ని, అదంతా వ‌ట్టి పుకారేన‌ని తాజాగా తెలిసింది. త‌న‌ని ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు సంప్ర‌దించ‌లేద‌ని, త‌ను విల‌న్‌గా న‌టించ‌డానికి సుముఖంగా లేర‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం.