చంద్రబాబు ఓటమి కోసమే మోహన్ బాబు డ్రామా !Mohan babu political drama on chandrababu

చంద్రబాబు నాయుడు ని ఓడించాలనే  కక్ష్య తోనే సినీ నటుడు మోహన్ బాబు డ్రామా ఆడినట్లుగా తెలుస్తోంది . పేరుకి విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అని ధర్నా డ్రామా ఆడినప్పటికీ తెరవెనుక జగన్ కు లభించేలా ప్రయత్నాలు చేసాడని టాక్ వినిపిస్తోంది . ఎన్నికల కోడ్ అమలులో ఉండగా , ఎన్నికలకు నామినేషన్లు వేస్తున్న ఈ తరుణంలో చేయాల్సిన అవసరం ఏంటి ?

 

ఫీజు రీ ఎంబర్స్ మెంట్ గురించి కొంతకాలంగా మోహన్ బాబు అంటున్నాడు బాగానే ఉంది కానీ పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం ద్వారా జగన్ కు లభించేలా చేస్తున్నాడు మోహన్ బాబు . జగన్ కు మోహన్ బాబు కు బంధుత్వం ఉన్న విషయం తెలిసిందే . అందుకే చంద్రబాబు కి వ్యతిరేకంగా ఈ డ్రామా నడిపించాడట . చంద్రబాబు – మోహన్ బాబు లు కూడా బంధువులే అయితే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది దాంతో జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు మోహన్ బాబు .

Enfglish Title: Mohan babu political drama on chandrababu