పెద్ద రాయుడు మళ్ళీ వస్తున్నారు..కానీ ఈ సారి దొంగగా…


పెద్ద రాయుడు మళ్ళీ వస్తున్నారు..కానీ ఈ సారి దొంగగా...
పెద్ద రాయుడు మళ్ళీ వస్తున్నారు..కానీ ఈ సారి దొంగగా…

కలెక్షన్ కింగ్ ‘మోహన్ బాబు’ గారు మళ్ళి మోకానికి రంగు వేయబోతున్నారు. అవును మళ్ళి తిరిగి సినిమాలోకి వస్తారంట. ఇక యధావిధిగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటున్నారు అతని కుమారులు. మంచి కథ కోసం చూసిన మోహన్ బాబు గారు ఈ సారి దొంగగా రాబోతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే……

‘గోయింగ్ ఇన్ స్టైల్’ హాలీవుడ్ సినిమా ఆధారంగా తెలుగులో రీమేక్ చేయడానికి అన్ని పనులు దాదాపు పూర్తి అయినట్లే అంటున్నారు మోహన్ బాబు గారు. సినిమాకి నిర్మాత కూడా మోహన్ బాబు గారే. దర్శకులు ‘బీవీఎస్ రవి’ సినిమాని దర్శకత్వం చేయబోతున్నారు. అయితే మోహన్ బాబు గారు సినిమాలో కొంచెం ‘ముసలి వారు’ గెట్ అప్ లో కనిపించబోతున్నారు అని అంటున్నారు సినిమా దర్శకులు.

సినిమాలో మోహన్ బాబు గారితో పాటు ఇంకా ఇద్దరు సీనియర్ కథ నాయకులు కూడా నటించబోతున్నారు. వీళ్ళ ముగ్గురు బ్యాంకు కి కన్నం వేసే పాత్రలో దర్శనమిస్తారంటా. కారణం ఏంటంటే వీళ్ళ ముగ్గురికి నెలకి పెన్షన్ ఇచ్చే బ్యాంకు… ఆ పెన్షన్ ని ఆపేస్తే ఏమి చేయాలో తెలియని వాళ్ళు ఎలా బ్యాంకు ని దొంగిలిస్తారు అనేది కథ. ఈ సినిమాకి సంబంధిచిన ఇంకా కొన్ని వార్తలు త్వరలోనే చెప్తాము అంటున్నారు సినిమా యూనిట్ వాళ్లు.

ప్రస్తుతానికి ఒక తమిళ సినిమాలో సూర్య తో కలిసి ముఖ్య పాత్ర పోషిస్తున్న మోహన్ బాబు గారు ఇంకా ముందు ముందు సినిమాలు ఎలా చేయబోతున్నారో అని మంచు అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు.