
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన పంథాకు భిన్నంగా నటనకు, ముఖ్యంగా సినిమాకు కీలకమైన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. `మహానటి` చిత్రంలో ఎస్వీరంగారావు పాత్రలో ఆకట్టుకున్న ఆయన ప్రస్తుతం సూర్య హీరోగా నటించిన `ఆకాశమే నీహద్దురా` చిత్రంలో నటిస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌బాబు తన ఒరిజినల్ పేరు గల పాత్రలో నటిస్తుండటం విశేషం.
మోహన్‌బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. సినిమాలో ఆయన త్యంత క్రశిక్షణ గల ఏయిర్ కమాండర్ పాత్రలో కనిపించబోతున్నారు. రియల్ లైఫ్‌లో మోహన్‌బాబు క్రమశిక్షణతో వుంటారు. ఆయన తీరు వల్ల ఇప్పటికీ టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. సినిమాలో మోహన్‌బాబు, సూర్యల మధ్య వచ్చే సన్నివేశాలు విజువల్ ట్రీట్‌గా వుంటాయట.
సుధా కొంగర యాదృశ్చికంగానే ఆ పాత్రకు భక్త వత్సలం నాయుడు అని పేరు పెట్టినా అది మోహన్‌బాబు అసలు పేరు కావడంతో ఈ పాత్ర తీరు తెన్నులు ఎలా వుంటాయి? సూర్యతో కలిసి నటిస్తున్న తొలి సినిమా ఎలా వుండబోతోంది వీరి కాంబినేషన్ అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. మరి కొన్ని గంటల్లోనే ఈ సస్పెన్స్‌కు తెరపడబోతోంది. ఈ నెల 12న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. బుధవారం అర్థ్రరాత్రికే టాక్ బయటికి వచ్చే అవకాశం వుంది.