క‌లెక్ష‌న్‌కింగ్ `స‌న్ ఆఫ్ ఇండియా` ఫ‌స్ట్ లుక్‌!

క‌లెక్ష‌న్‌కింగ్ `స‌న్ ఆఫ్ ఇండియా` ఫ‌స్ట్ లుక్‌!
క‌లెక్ష‌న్‌కింగ్ `స‌న్ ఆఫ్ ఇండియా` ఫ‌స్ట్ లుక్‌!

విల‌క్ష‌న న‌టుడు మోహ‌న్‌బాబు కొంత విరామం త‌రువాత హీరోగా న‌టిస్తున్న చిత్రం `స‌న్ ఆఫ్ ఇండియా`.  డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌మ‌కాలీన రాజ‌కీయాల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మోహ‌న్‌బాబు ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. శ్రీ‌ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్‌పై హీరో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. కాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని హీరో మోహ‌న్‌బాబు శుక్ర‌వారం విడుద‌ల చేశారు.
వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెడ‌లో రుద్రాక్ష ధ‌రించి సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో మోహ‌న్‌బాబు క‌నిపిస్తున్నారు. త‌న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని అభిమానుల‌తో పంచుకున్న మోహ‌న్‌బాబు `అత‌ని బ్ల‌డ్‌లోనే వుంది దేశ భ‌క్తి` అంటూ త‌న క్యారెక్ట‌ర్‌ని ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేశారు.

స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి మోహ‌న్‌బాబు స్వ‌యంగా స్క్రీన్‌ప్లే ని అందిస్తుండ‌టం విశేషం. గ‌తంలో త‌ను న‌టించిన పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ మూవీస్ త‌ర‌హాలోనే ఓ ప‌వ‌ర్‌ఫుల్ అంశాన్ని తీసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. చాలా రోజుల త‌రువాత త‌న‌దైన స్టైల్ డైలాగ్‌ల‌తో మోహ‌న్‌బాబా ఆక‌ట్టుకుంటారో చూడాలి.