క‌లెక్ష‌న్‌కింగ్ కూడా 29నే అప్‌డేట్ ఇచ్చేస్తున్నాడు!

క‌లెక్ష‌న్‌కింగ్ కూడా 29నే అప్‌డేట్ ఇచ్చేస్తున్నాడు!
క‌లెక్ష‌న్‌కింగ్ కూడా 29నే అప్‌డేట్ ఇచ్చేస్తున్నాడు!

క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం `స‌న్నాఫ్ ఇండియా`. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్‌పై హీరో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొంత విరామం త‌రువాత మోహ‌న్‌బాబు హీరోగా న‌టిస్తున్న చిత్ర‌మిది. స‌మ‌కాలీన రాజ‌కీయాల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

దాదాపు మూడు నెల‌ల క్రితం ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై సంధిస్తున్న వ్యంగ్యాస్త్రంగా ఈ మూవీ వుండే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌‌ని ఈ నెల 29న చిత్ర బృందం రిలీజ్‌ చేయ‌బోతోంది. 29 ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌‌ని రిలీజ్ చేస్తున్నారు. ఇదే రోజు చిరు `ఆచార్య‌` టీజ‌ర్ విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే.

`స‌న్నాఫ్ ఇండియా` చిత్రానికి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు స్వ‌యంగా స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అంతే కాకుండా ఆయ‌న కోడ‌లు, హీరో మంచు విష్ణు వైఫ్ విరోనిక ఈ మూవీకి స్టైలిస్ట్ గా వ‌ర్క్ చేస్తోంది. స‌ర్వేష్ మురారి ఛాయాగ్ర‌హ‌ణం, మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం. గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు.