చైనాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న `దృశ్యం`!


చైనాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న `దృశ్యం`!
చైనాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న `దృశ్యం`!

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ `దృశ్యం`. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో 2013లో వ‌చ్చిన ఈ చిత్రం మ‌ల‌యాళ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద 75 కోట్లు వ‌సూలు చేసి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. తెలుగుతో పాటు త‌మిళ‌, కన్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ రీమేక్ అయి ప్ర‌తి భాష‌లోనూ అనూహ్య విజ‌యాన్ని సాధించింది.

2017లో శ్రీ‌లంక‌లోనూ `ధ‌ర్మ‌యుద్ధాయ‌` పేరుతో రీమేక్ చేస్తే అక్క‌డ కూడా భారీ వ‌సూళ్ల‌నే సాధించింది. తాజాగా చైనీస్‌లో రీమేక్ చేశారు. బ‌హుషా చైనీస్‌లో రీమేక్ అయిన తొలి భార‌తీయ చిత్రం ఇదేనేమో. `షీప్ వితౌట్ ఎ షెప‌ర్డ్‌` పేరుతో రూపొందిన ఈ చిత్రం చైనీస్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఫ్యామిటీ భావోద్వేగాల నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రానికి చైనీయులు బ్ర‌హ్మ‌ర‌థంప‌డుతున్నారు. డానీయ‌న్ `ఐపీ మ్యాన్ 4` చిత్రాన్నే వ‌సూళ్ల ప‌రంగా చైనాలో వెన‌క్కి నెట్టి సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

డిసెంబ‌ర్ 13న రిలీజ్ అయిన ఈ చిత్రం 168 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఒక భార‌తీయ సినిమా చైనాలో రీమేక్ కావ‌డం, అక్క‌డ స్థానిక చిత్రాల‌కే బాక్సాఫీస్ వ‌ద్ద అల్లాడిస్తుండ‌టం విశేషంగా చెప్పుకుంటున్నారు.