ఆ భారీ సినిమా ఆగిపోయింది

దక్షిణాది లోనే కాకుండా మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో మహాభారతం అనే సినిమాని తీయడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేసారు మలయాళ నిర్మాత బీఆర్ శెట్టి . మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ , హిందీ , మలయాళ బాషలలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి మూడేళ్ళుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు . అలాగే నాగార్జున ని కూడా ఇందులో కర్ణుడి పాత్రకు తీసుకోవాలని అనుకున్నారు .

అయితే సినిమా అనుకొని మూడేళ్లు దాటినా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది కానీ సెట్స్ మీదకు మాత్రం వెళ్లడం లేదు దాంతో దర్శకులు శ్రీ కుమార్ , స్క్రీన్ ప్లే రచయిత వాసుదేవ నాయర్ కు అలాగే నిర్మాత బీఆర్ శెట్టి కి మధ్య వివాదాలు చెలరేగాయి . అవి మరీ ఎక్కువ కావడంతో ఎట్టకేలకు ఈ సినిమా ఆగిపోయినట్లు నిర్మాత బిఆర్ శెట్టి ప్రకటించారు .

అయితే ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల సమయం వృథా చేసానని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రచయిత వాసుదేవ నాయర్ . ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమా రాబోతోంది ఇదిగో అదిగో అంటూ ప్రచారం చేసి చివరకు ఊసురుమనిపించారు .