మెగాస్టార్ సినిమాకు మ‌ళ్లీ డైరెక్ట‌ర్ మారాడు!మెగాస్టార్ సినిమాకు మ‌ళ్లీ డైరెక్ట‌ర్ మారాడు!
మెగాస్టార్ సినిమాకు మ‌ళ్లీ డైరెక్ట‌ర్ మారాడు!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మ‌ళ్లీ మొద‌లైంది. త్వ‌ర‌లో ఈ మూవీ సెట్‌లో చిరంజీవి సంద‌డి చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత వెంట‌నే చిరు `లూసీఫ‌ర్` రీమేక్‌ని ప‌ట్టాలెక్కించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఈ రీమేక్ మ‌ళ్లీ చేతులు మారింది. ముందు ఈ మూవీ స్క్రిప్ట్ బాధ్య‌త‌ల్ని సుకుమార్‌తో పాటు `సాహో` ఫేమ్ సుజీత్‌కి అప్ప‌గించారు. అయితే చిరుకు సంతృప్తి క‌ల‌గ‌క‌పోవ‌డంతో ఆ త‌రువాత వి.వి.వినాయక్ కు అప్ప‌టింగిచారు. వినాయ‌క్ రైట‌ర్ ఆకుల శివ‌ని దించారు. వీరు చేసిన మార్పులు కూడా చిరుకు న‌చ్చ‌లేద‌ట‌. తాజాగా ఈ రీమేక్ బాధ్య‌త‌ల్ని త‌మిళ ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ మోహ‌న్ త‌న‌యుడు మోహ‌న్‌రాజాకు అప్ప‌గించార‌ట‌.

మోహ‌న్‌రాజాకు త‌మిళ్‌లో రీమేక్ చిత్రాల స్పెష‌లిస్ట్‌గా మంచి పేరుంది. ఆ కార‌ణంగానే మెగాస్టార్ `లూసీఫ‌ర్‌` రీమేక్ బాధ్య‌త‌ల్ని మోహ‌న్‌రాజాకు అప్ప‌గించార‌ట‌. ఇందులో స‌ర్‌ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే తెలుగు రీమేక్ వెర్ష‌న్‌లో చిరుకు హీరోయిన్ వుండ‌దంట‌. రొమాంటిక్ ట్రాక్ ని కూడా యాడ్ చేయ‌డం లేద‌ని తెలిసింది. మోహ‌న్‌రాజా తెలుగు రీమేక్ వెర్ష‌న్ స్క్రిప్ట్‌ని ప‌ర్‌ఫెక్ట్‌గా కంప్లీట్ చేసి చిరు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ మూవీ స్టార్ట్ కావ‌డం ఖాయం అని చెబుతున్నారు.