అరెస్ట్ వార్తలపై స్పందించిన మోహన్ బాబు


Mohanbabu
సినీ నటుడు మంచు మోహన్ బాబు చెక్ బౌన్స్ కేసులో సంవత్సరం జైలు శిక్ష పడిందని అలాగే అరెస్ట్ చేసారని వచ్చిన వార్తలపై స్పందించాడు మోహన్ బాబు . వైవిఎస్ చౌదరి కోర్టుని తప్పుదోవ పట్టించడం వల్ల ఏడాది జైలుశిక్ష విధించిన మాట వాస్తవమే కానీ అరెస్ట్ చేసారు అన్నది నిజం కాదని ,అయితే కొంతమంది అత్యుత్సాహపరులు మోహన్ బాబు అరెస్ట్ అంటూ కథనాలు వండారని మండిపడ్డాడు మోహన్ బాబు . 
 
2010 లో వైవిఎస్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా సలీం అనే చిత్రాన్ని నిర్మించాడు మోహన్ బాబు . ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది అయితే ఆ సినిమాతో పాటుగా మరో సినిమా చేద్దామని 48 లక్షల చెక్ ఇచ్చాడట మోహన్ బాబు . కానీ సలీం సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో 48 లక్షల చెక్ బ్యాంక్ అకౌంట్ లో వేసుకోవద్దని చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా అకౌంట్ లో వేసి చెక్ బౌన్స్ అయ్యేలా చేయడమే కాకుండా  వైవిఎస్ చౌదరి నన్ను కోర్టు కీడ్చాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు మోహన్ బాబు .