స్టార్ హీరో కోసం 500 మంది సాహ‌సం!

స్టార్ హీరో కోసం 500 మంది సాహ‌సం!
స్టార్ హీరో కోసం 500 మంది సాహ‌సం!

ద‌క్షిణాదిలో స్టార్స్‌ని డెమీ గాడ్స్‌గా చూస్తుంటారు ఫ్యాన్స్‌. వారి కోసం ఏం చేయ‌డానికైనా ఎం దాకా వెళ్ల‌డానికైనా వెనుకాడ‌రు. స్టార్ హీరో సినిమా వ‌స్తోందంటే థియేట‌ర్ల ముందు, సోష‌ల్ మీడియాలోనూ ఫ్యాన్స్చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక బ‌ర్త్‌డే ఫంక్ష‌న్ వ‌చ్చిందంటే హీరోల కోసం ర‌క్త‌దానాలు, పేద‌ల‌కు నిత్యావ‌స‌రాలు, పండ్లు పంచ‌డాలు చేస్తుంటారు. కానీ మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ ఫ్యాన్స్ ఓ సాహ‌సానికి శ్రీ‌కారం చుట్టారు.

ఇప్పుడిది మ‌ల‌యాళ ఇండ‌స్త్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నెల 21న స్టార్ హీరో, కంప్లీట్ స్టార్ మోహ‌న్‌లాల్ 60వ జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని తిరువ‌నంత‌పురంకు చెందిన 500 మంద మోహ‌న్‌లాల్ అభిమానులు త‌మ అవయ‌వాలు దానం చేయ‌డానికి ముందుకు రావ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈ విష‌యాన్ని కేర‌ళ హెల్త్ మినిస్ట‌ర్ కె.కె. శైల‌జ వెల్ల‌డించారు.

మోహ‌న్‌లాల్ త్వ‌ర‌లో సూప‌ర్‌హిట్ చిత్రం `దృశ్యం`కు సీక్వెల్‌గా రూపొంద‌నున్న `దృశ్యం 2`లో న‌టించ‌నున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ టీజ‌ర్‌ని పుట్టిన రోజు సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రాన్ని ఆంటోని పెరంబువార్ నిర్మించ‌నున్నారు.