బాలయ్య – బోయపాటి ప్రాజెక్ట్ నుండి నందమూరి ఫ్యాన్స్ కు తీపి కబురు!


Mokshagna entry in Balayya, Boyapati script
Mokshagna entry in Balayya, Boyapati script

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు ఘోర పరాజయం పొందడంతో అటు నిర్మాతగా చేతులు కాల్చుకున్నాడు. హీరోగా కూడా రెండు డిజాస్టర్స్ ను ఖాతాలో వేసుకున్నాడు. పర్సనల్ గా కూడా తండ్రి బయోపిక్ ను తీసి విఫలయమయ్యాననే బాధ కూడా నందమూరి బాలకృష్ణ అనుభవిస్తున్నాడు. దాన్నుండి బయటపడి రూలర్ చిత్రంలో నటిస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ చేస్తోన్న 105వ చిత్రం రూలర్.

ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. బాలకృష్ణ ఇందులో రెండు విభిన్న గెటప్స్ లో కనిపించనున్నాడు. ఒకటి సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ రోల్ కాగా, ఇంకోటి పోలీస్ ఆఫీసర్ పాత్ర. సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ పాత్రలో క్లాస్ గా కనిపించిన బాలయ్య, పోలీస్ పాత్రలో రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తుండగా, భూమిక కీలక పాత్రలో కనిపిస్తుంది. కెఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సి కళ్యాణ్ నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

ఈ చిత్రం తర్వాత నందమూరి బాలకృష్ణ తనతో రెండు సూపర్ హిట్స్ తీసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 106వ చిత్రాన్ని చేయనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం సింహ, లెజండ్ ను మించి ఉంటుందని, బాలయ్య పాత్ర పవర్ ఫుల్ గా ఉంటూనే ఎమోషనల్ గా కూడా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. జనవరి నుండి ఈ సినిమా చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది దసరా సెలవుల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర అంశం.. ఇందులో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. నిజానికి మోక్షజ్ఞ ఎంట్రీ 2018లోనే.జరగాలి  బాలకృష్ణ అప్పట్లోనే మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన హింట్ ఇచ్చాడు. అయితే ఇప్పటిదాకా దీని గురించి ఎటువంటి క్లారిటీ లేదు. ఫుల్ లెంగ్త్ సినిమా చేసే ముందు ఇలా తండ్రి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని బోయపాటి, బాలయ్యను కోరాడట. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది.

బోయపాటి శ్రీను కూడా ఇప్పుడు అజ్ఞాతంలోనే ఉన్నాడు. తను ఎంతో నమ్మి తీసిన వినయ విధేయ రామ దారుణంగా బెడిసికొట్టడంతో పాటు బోయపాటిపై కూడా తీవ్రంగా విమర్శలు చెలరేగాయి. దీంతో బోయపాటి టాలెంట్ పైనే డౌట్ లు వచ్చే పరిస్థితి నెలకొంది. అటు బాలకృష్ణకు ఇటు బోయపాటి శ్రీనుకు ఈ సినిమా విజయం సాధించడం అత్యంత అవసరం. ఈ విషయం పక్కన పెడితే బోయపాటి – బాలకృష్ణ సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉంటుందా అన్ని చర్చలు అభిమానుల్లో మొదలైంది. ఇంతకీ బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీకి ఒప్పుకుంటాడా లేక డైరెక్ట్ సినిమాలోనే మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకురావాలని భావిస్తాడా? ఏమో సమయమే సమాధానం చెప్పాలి.