భయపెడుతున్న మోక్షజ్ఞ లుక్


Mokshagna
Mokshagna

నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ లుక్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఆ లుక్ నందమూరి అభిమానులను భయపెడుతోంది . ఎందుకంటే హీరో అంటే స్లిమ్ గా ఉండాలి కానీ మోక్షజ్ఞ మాత్రం చాలా లావుగా ఉన్నాడు హీరో లుక్ అస్సలు కనిపించడం లేదు ఏ కోశానా చూసినా .

అసలు మోక్షజ్ఞ ని 2017 లోనే హీరోగా పరిచయం చేయాలని అనుకున్నాడు బాలయ్య , కానీ మోక్షజ్ఞ కు అంతగా ఆసక్తి లేకపోవడంతో అది వాయిదాపడుతూ వస్తోంది . ఇక ఇటీవలే నేను సినిమాలు చేయను , బిజినెస్ చూసుకుంటాను అని అన్నట్లు గుసగుసలు వినిపించాయి . సినిమాలపై ఆసక్తి లేకపోతే బాడీ స్లిమ్ గా ఉండాల్సిన అవసరమే లేదు కదా ! అందుకే కాబోలు ఇలా లావుగా అవుతున్నాడు . అయితే బాలయ్య అభిమానులు మాత్రం ఈ లుక్ ని జీర్ణించుకోవడం కష్టమే !