బిగ్‌బాస్ 4: విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేస్తున్నారా?


బిగ్‌బాస్ 4: విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేస్తున్నారా?
బిగ్‌బాస్ 4: విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేస్తున్నారా?

బిగ్‌బాస్ రియాలిటీ షోపై విమ‌ర్శ‌లు కొత్తేమీ కాదు కానీ ఈ సీజ‌న్‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు మాత్రం కొత్తే. ఎందుకంటే షో స్టార్ట‌యి ఆరు వారాలు దాటినా బిగ్‌బాస్ నిర్వాహ‌కుల్లో విశ్వ‌స‌నీయ‌త లేక‌పోవ‌డ‌మే ప్రధాన స‌మ‌స్య‌గా మారింది. కొంత మంది కంటెస్టెంట్‌ల విష‌యంలో అది స్ప‌ష్టంగా క‌నిపించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. 16 మందితో మొద‌లైన ఈ షో నుంచి సూర్య‌కిర‌ణ్ , క‌రాటే క‌ల్యాణీ, దేవి నాగ‌వ‌ల్లి, క‌రాటే క‌ళ్యాణి, స్వాతీ దీక్షిత్‌, గంగ‌వ్వ, సుజాత‌, కుమార్ సాయి బ‌య‌టికి వ‌చ్చేశారు.

ఇందులో గంగ‌వ్వ ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల హౌస్‌లో వుండ‌లేక బ‌య‌టికి వ‌చ్చేసింది. వున్న‌కంటెస్టెంట్‌ల‌లో మోనాల్‌, అఖిల్ ఎప్పుడో బ‌య‌టికి రావాలి. కానీ వారిని బిగ్‌బాస్ కావాల‌నే ఆపేస్తున్నాడ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మోనాల్ ముగ్గురిలో ల‌వ్ ట్రాక్ న‌డిపించ‌డం .. త‌ప్పులు చేస్తూ సింప‌తీ కోసం ఏడుస్తుండ‌టం.. మ‌ళ్లీ అదే త‌ప్పులు చేస్తుండ‌టంతో నెటిజ‌న్‌ల చిరాకు పీక్స్‌కి చేరిపోయింది.

కుమార్ సాయిని ఎలిమినేట్ చేయ‌డంతో బిగ్‌బాస్ ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో నెటిజ‌న్స్ బిగ్‌బాస్‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. దీని నుంచి బ‌య‌ట‌ప‌డి షో స‌జావుగా న‌డ‌వాలంటే బిగ్‌బాస్ ముందున్న ఏకైక మార్గం మోనాల్‌ని ఇంటి నుంచి బ‌య‌టికి పంప‌డ‌మే. ఇదే నిర్ణ‌యానికి బిగ్‌బాస్ నిర్వాకులు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

హౌస్‌లో వుండ‌టానికి ముందు అభిజిత్‌తో ఆ త‌రువాత అఖిల్‌తో ఇప్ప‌డు అఖిల్‌, అవినాష్‌లతో మోనాల్ ల‌వ్‌ట్రాక్ న‌డిపిస్తుండ‌టం వీక్ష‌కుల‌కు రోత‌పుట్టిస్తోంది. ఇది మ‌రింత ఎబ్బెట్టుగా క‌నిపించే స్థాయికి వెళ్ల‌బోతున్న నేప‌థ్యంలో ఈ వారాంతంలో మోనాల్‌ని ఇంటికి పంపించాల‌ని బిగ్‌బాస్ నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో అయినా విమ‌ర్శ‌ల‌కు చెక్ ప‌డుతుందేమో చూడాలి.