అఖిల్ కోస‌మే ఒప్పుకున్నాను : మోనాల్‌

అఖిల్ కోస‌మే ఒప్పుకున్నాను : మోనాల్‌
అఖిల్ కోస‌మే ఒప్పుకున్నాను : మోనాల్‌

ప్ర‌ముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4లో బుల్లితెర ప్రేక్ష‌కుల్ని మెప్పించిన జంట మోనాల్ గ‌జ్జ‌ర్‌, అఖిల్ స‌ర్తాక్‌. ఈ జంట ఈ షోలో ల‌వ్ బ‌ర్డ్స్‌గా ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకున్నారు. వీరి ప్రేమాయ‌ణం కార‌ణంగా షో మ‌రింత పాపుల‌ర్ అయింది. బ‌య‌టికి వ‌చ్చాక కూడా వీరు నిజంగా ప్రేమ‌లోనే వున్నార‌ని అంతా భావిస్తున్నారు.
వీరి క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో `తెలుగు అబ్బాయి గుజ‌రాత్‌ అమ్మాయి` పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని నిర్మిస్తున్నారు. భాస్క‌ర్ బంటుప‌ల్లి ఈ వెబ్ సిరీస్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఈ వెబ్ డ్రామాకు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. దాండియా ఆడుతూ అఖిల్‌, మోనాల్ చిరున‌వ్వులు చిందిస్తున్న మోష‌న్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవ‌డానికి గల కార‌ణాన్ని మోనాల్ తాజాగా వెల్ల‌డించింది. `ఈ వెబ్ సిరీస్ గురించి మేక‌ర్స్ కొన్ని రోజుల క్రిత‌మే న‌న్ను సంప్ర‌దించారు. ఇందులో నాకు జంట‌గా హీరో పాత్ర‌లో అఖిల్ న‌టిస్తున్నాడ‌ని తెలిసి వెంట‌నే సంత‌కం చేశాను` అని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది మోనాల్‌. ఈ వెబ్ డ్రామా షూటింగ్ వ‌చ్చే నెల రెండ‌వ వారం నుంచి ప్రారంభం కాబోతోంది.