మహేష్ – రాజమౌళి సినిమాపై మరింత క్లారిటీ

మహేష్ - రాజమౌళి సినిమాపై మరింత క్లారిటీ
మహేష్ – రాజమౌళి సినిమాపై మరింత క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ గతేడాది జరిగిన విషయం తెల్సిందే. రాజమౌళి ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఎప్పటినుండో మహేష్ తో సినిమా చేయాలని, ఆర్ ఆర్ ఆర్ తర్వాత కచ్చితంగా మహేష్ తో సినిమా చేస్తానని అన్నాడు. దుర్గా ఆర్ట్స్ అధినేత కెఎల్ నారాయణ ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నాడు.

ఇప్పుడు ఈ సినిమాపై మరింత క్లారిటీ వచ్చింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే మహేష్ ప్రాజెక్ట్ కోసం జక్కన్నకు కొన్ని ఐడియాలను చెప్పడం జరిగిందట. అయితే ఇంకా స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కనీసం జోనర్ ఏంటనేది కూడా ఫైనల్ అవ్వలేదని తెలుస్తోంది.

ఆర్ ఆర్ ఆర్ పూర్తైన తర్వాతే రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడట. ప్రస్తుతం తన దృష్టాంతా వీలైనంత త్వరగా ఆర్ ఆర్ ఆర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపైనే ఉంది.