మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మనసా మనసా సాంగ్ : సిద్ శ్రీరామ్ సెన్సేషన్


మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మనసా మనసా సాంగ్ : సిద్ శ్రీరామ్ సెన్సేషన్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మనసా మనసా సాంగ్ : సిద్ శ్రీరామ్ సెన్సేషన్

ఈ మధ్య సిద్ శ్రీరామ్ పాడిన ఏ పాటైనా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొన్న అల వైకుంఠపురములో చిత్రంలో సామజవరగమన అనే సాంగ్ ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అలాగే ప్రదీప్ మాచిరాజు హీరోగా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే చిత్రంలో నీలి నీలి ఆకాశం సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తోంది. ఇక ఈ ఏడాది మరో చార్ట్ బస్టర్ తో మన ముందుకు వచ్చాడు సిద్ శ్రీరామ్. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ మనసా మనసా సాంగ్ ను కొద్దిసేపటి క్రితం లాంచ్ చేసారు.

వింటున్న కొద్దీ ఈ సాంగ్ వినాలపించడం దీని స్పెషలిటీ. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గోపి సుందర్, సిద్ శ్రీరామ్ కాంబినేషన్ లో ఇంతకు ముందు గీత గోవిందం చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలె సాంగ్ ఎన్ని సంచలనాలకు కేంద్ర బిందువు అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ లో మరో సూపర్ హిట్ సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ ను సురేంద్ర కృష్ణ రచించాడు. తన మనసు తాను ఇష్టపడిన అమ్మాయిని కోరుకుంటుంటే హీరో ఆలపించే రొమాంటిక్ గీతంగా అర్ధమవుతోంది.

మొదటి సాంగ్ కు ఫస్ట్ టైమ్ విన్నప్పుడే చార్ట్ బస్టర్ అన్న సంకేతాలు లభించడంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రానికి పెర్ఫెక్ట్ ప్రమోషన్ కుదిరినట్లే. అఖిల్ సరసన ఈ చిత్రాల్లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమెది స్టాండప్ కామిక్ పాత్ర. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మే 22న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. గీతా ఆర్ట్స్ 2 ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మొదటి మూడు చిత్రాలు ప్లాపైన నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు అఖిల్.