మొత్తానికి అఖిల్ అక్కినేని కూడా డేట్ ఇచ్చేశాడు!

మొత్తానికి అఖిల్ అక్కినేని కూడా డేట్ ఇచ్చేశాడు!
మొత్తానికి అఖిల్ అక్కినేని కూడా డేట్ ఇచ్చేశాడు!

అక్కినేని వార‌బ్బాయి అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌`. అఖిల్ న‌టిస్తున్న నాలుగ‌వ చిత్ర‌మిది. కొంత విరామం త‌రువాత బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ ఇద్ద‌రికీ ఈ మూవీ హిట్ చాలా ముఖ్యం. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు.

గ‌త కొన్ని నెల‌లుగా ఈ మూవీ రిలీజ్‌పై ప‌లు ర‌కాలు వార్త‌లు షికారు చేస్తూ వ‌చ్చాయి. రీ షూట్ చేస్తున్నార‌ని, రిలీజ్ డేట్ ఇప్ప‌ట్లో వుండ‌ద‌ని.. ఇలా ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా హీరోలంతా రిలీజ్ డేట్‌లు ప్ర‌క‌టిస్తున్నా ఈ చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్‌డేట్ రావ‌డం లేద‌ని అక్కినేని ఫ్యాన్స్ అనుకుంటున్న త‌రుణంలో ఈ చిత్ర బృందం రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించేసింది.

విభిన్న‌మైన ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాన్ని జూన్ 19న విడుద‌ల చేస్తున్న‌ట్టు బుధ‌వారం సాయంత్రం ప్ర‌క‌టించారు. దీంతో అక్కినేని అభిమానులు పండ చేసుకుంటున్నారు. త‌మ హీరో సినిమా రిలీజ్ డేట్ కూడా వ‌చ్చేసింద‌ని నెట్టింట సంద‌డి చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర టీజ‌ర్ సినిమాని బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కొత్త పంథాలో తెర‌కెక్కించిన‌ట్టుగా స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.