అన్న వదిలిన డేట్ ను తమ్ముడు బుక్ చేసుకున్నాడా?


అన్న వదిలిన డేట్ ను తమ్ముడు బుక్ చేసుకున్నాడా?
అన్న వదిలిన డేట్ ను తమ్ముడు బుక్ చేసుకున్నాడా?

సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది. అంటే సినిమాల జాతర మొదలవుతున్నట్లే. సంక్రాంతి సినిమాల సూపర్ సక్సెస్ తర్వాత టాలీవుడ్ లో సినిమా ఫలితాల పరంగా కొంత స్తబ్దత నెలకొన్న విషయం తెల్సిందే. ఆ రేంజ్ లో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో సమ్మర్ సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే చాలా వరకూ సినిమాలు రిలీజ్ డేట్స్ ను ప్రకటించుకుని ఆ ప్రకారంగా సిద్ధమవుతున్నాయి. సమ్మర్ అంతా వారానికి ఒక సినిమా హల్చల్ చేయనున్న నేపథ్యంలో చిత్రానికి హిట్ టాక్ రావడం అనేది చాలా అవసరం. ఇక సమ్మర్ అంటే ఏప్రిల్ నుండి సినిమాల సందడి మరింత పెరగనున్న విషయం తెల్సిందే.

వారానికి ఒక సినిమా కంటే ఎక్కువే ఈ సీజన్ లో రానున్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ కోసం చూస్తున్న తమ్ముడు అన్న వదిలేసిన రిలీజ్ డేట్ ను క్యాచ్ చేసాడు. ఆ అన్న అక్కినేని నాగ చైతన్య కాగా, ఆ తమ్ముడు అక్కినేని అఖిల్.

నాగ చైతన్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ ఏప్రిల్ 16న విడుదల కావడానికి మొదట షెడ్యూల్ అయింది. అయితే శేఖర్ కమ్ముల సినిమాల విషయంలో కొంచెం స్లో గానే వ్యవహరిస్తాడు. రిలీజ్ డేట్ కోసం కంగారుపడిపోడు. ఔట్పుట్ సరిగా వచ్చేవరకూ చెక్కుతూనే ఉంటాడు. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. ఏప్రిల్ నుండి ఈ సినిమా రిలీజ్ జూన్ కు షిఫ్ట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు అదే రిలీజ్ డేట్ ను తమ్ముడు అఖిల్ క్యాచ్ చేసాడట. మొదటి మూడు చిత్రాలు ప్లాప్ అయిన నేపథ్యంలో నాలుగో చిత్రంతోనైనా హిట్ అందుకోవాలని తహతహలాడుతున్న అఖిల్ చేస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయిక. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నారు. అదీ సంగతి.