పెద్దల మొట్టికాయలతో సద్దుమణిగిన వివాదం


Movie artistes association controversy end సినీ పరిశ్రమ పెద్దలు మా కార్యవర్గానికి మొట్టికాయలు వేయడంతో మొత్తానికి మా అధ్యక్షుడు శివాజీరాజా , ప్రధానకార్యదర్శి నరేష్ లు మెట్టుదిగి రాజీకొచ్చారు దాంతో మాలో మొదలైన సంగ్రామం సద్దుమణిగింది . కొద్దిరోజుల కిందట శివాజీరాజా – నరేష్ ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు . మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి చేత చేయించిన షోలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నరేష్ శివాజీరాజా పైన శ్రీకాంత్ పైన ఆరోపణలు చేసాడు . ఇక శివాజీరాజా , శ్రీకాంత్ లు ఎలాంటి తప్పు జరగలేదని మీడియా ముందు పేర్కొన్న విషయం తెలిసిందే .

అయితే ఈ వివాదం వల్ల ఫిలిం ఇండస్ట్రీ పరువుపోతోందని భావించిన సినీ పెద్దలు సమావేశమై ఎలాంటి తప్పులు జరగలేదని , ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ మీడియాకు ఎక్కొద్దని మరింత పెద్దదిగా చేయొద్దని సలహా ఇచ్చారట దాంతో ఈరోజు మీడియా ముందుకు వచ్చి ” అంతా తూచ్ ” మేమంతా ఒక్కటయ్యాం , విబేధాలు పక్కన పెట్టాం అని సెలవిచ్చారు . ఈ సమావేశంలో అగ్ర నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు , కే ఎల్ నారాయణ , దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ , శివాజీరాజా , నరేష్ లు పాల్గొన్నారు .

English Title: Movie artistes association controversy end