లవర్స్ డే రోజు బరిలో 5 సినిమాలుMovies Tough Fight feb 14th
Movies Tough Fight feb 14th

వీక్ అంతా కష్టపడిపోయి, ఎదో వీక్ అయిపోయాం.! అని ఫీల్ అవుతూ మిగిలిన రెండు రోజుల్లో ప్రపంచానికి సంబంధం లేకుండా, మన ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నామనే భ్రమలో బ్రతుకుతూ మళ్ళీ బూతులు తిట్టుకుంటూ సోమవారం లేటు గా ఆఫేసుకు బయల్దేరి, ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని “ఎంటిరా.? ఈ జీవితం..”  అని బాధపడిపోయే బాయిలర్ చికెన్ యూత్ కి మెయిన్ టైం పాస్ సినిమాలు. అదే ఆరోజు దరిద్రం దశావతారాలు ఎత్తి, “వాలంటైన్స్ డే” లాంటి బంపర్ ఆఫర్ వస్తే ఇక మాములుగా ఉండదు. లేనివాడికి ఏం చెయ్యడానికి ఉండదు. ఉన్నవాడికి ఏం చెయ్యాలో అర్ధం కాదు. క్లారిటీ వచ్చేసరికి ఆరోజు కాస్తా అయిపోతుంది.

ఇక ఈ శుక్రవారం టాలీవుడ్ లో 5 సినిమాలు  పోటీ పడుతున్నాయి. అవి వరుసగా, విజయ్ దేవరకొండ “వరల్డ్ ఫేమస్ లవర్”, ధనుష్ నటించి జనవరి పొంగల్ సీజన్ లో తమిళ్ లో వచ్చి, ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్న “లోకల్ బాయ్”, (పట్టాస్ డబ్బింగ్), మిగిలిన మూడు సినిమాలు ఒక చిన్న విరామం, శివ 143, అనుభవించు రాజా. ఈ మూడు సినిమాలకు పెద్దగా బజ్ లేదు. జనాల ఫోకస్ అంతా “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా మీదే ఉంది. మరోవైపు కనపడకుండా బాలీవుడ్ నుండి కూడా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇంతియాజ్ అలీ డైరెక్షన్ లో కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరో రెండు చిన్న హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సరైన సినిమా లేదు.. శుక్రవారం దాకా దిల్ రాజు గారు తీసిన తమిళ 96 రీమేక్ జాను హవానే కనిపిస్తుంది. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా గనక ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే మిగిలిన సినిమాలు అన్నిటికీ కష్టమే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో లేదంటే, ఎంతోకొంత మిగిలిన సినిమాలు కూడా కలెక్షన్స్ తెచ్చుకుంటాయి.