రేవంత్ రెడ్డి ఎంట్రీ తోవాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయిRevanth Reddy
Revanth Reddy

మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి ఎంట్రీ తో మోజో టీవీ ని సొంతం చేసుకున్న కొత్త యాజమాన్యం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి . తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా రేవంత్ రెడ్డి కి పేరున్న విషయం తెలిసిందే . పైగా కేసీఆర్ అండ్ కో అంటే ఉవ్వెత్తున ఎగిసి పడటం రేవంత్ నైజం కావడంతో మోజో టివి కొత్త యాజమాన్యం ఏమి చేయాలో పాలుపోనీ స్థితిలో ఉందట .

టివి 9 రవిప్రకాష్ వల్ల మోజో టివి కూడా కొత్త యాజమాన్యం కిందికి వెళ్లిన సంగతి తెలిసిందే . అయితే మోజో టివి ని మూసేస్తూ అందులో పనిచేసే వాళ్ళని వెళ్లిపోండని హుకుం జారీ చేసారు దాంతో మోజో టివి బాధితులు రేవంత్ రెడ్డి ని ఆశ్రయించారట . ఇంకేముంది మనోడు రంగంలోకి దిగితే వాళ్లకు ముచ్చమటలు పట్టడం ఖాయం అందుకే దారి ఏంటి ? ఆలోచన చేస్తున్నారట .