హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి


harish rao and revanth reddy
harish rao and revanth reddy

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసాడు . నన్ను కొడంగల్ లో ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడిన హరీష్ రావు తగిన శిక్ష అనుభవిస్తున్నాడు .నన్ను ఓడించడం ద్వారా ఏదో సాధించామని గర్వంగా ఫీలయ్యారని , కానీ నన్ను ఓడించిన హరీష్ రావు కు తగిన శాస్తి జరిగిందంటూ కొడంగల్ లో సంచలన వ్యాఖ్యలు చేసాడు రేవంత్ రెడ్డి .

అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డి ని ఓడించడానికి హరీష్ రావు ని రంగంలోకి దించాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ . అయితే రేవంత్ ఓడిపోయాడు కానీ పార్లమెంట్ లో మల్కాజ్ గిరి స్థానం నుండి పోటీ చేసి సంచలన విజయం సాధించాడు . దాంతో నాకు ప్రమోషన్ లభించింది కానీ నన్ను ఓడించాలని చూసిన హరీష్ రావు కు మంత్రి పదవి లేదని అలాగే తెలంగాణ ప్రభుత్వంలో అతడి పరిస్థితి ఏంటో ? తెలిసిందేనని వ్యాఖ్యానించి దుమారం రేపాడు రేవంత్ రెడ్డి .