విజయ్ దేవరకొండ కు సవాల్ విసిరిన ఎంపీ సంతోష్ 


MP Santosh kumar challenged Vijay devarakonda
MP Santosh kumar challenged Vijay devarakonda

విజయ్ దేవరకొండ కు సవాల్ విసిరిన ఎంపీ సంతోష్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ హీరో విజయ్ దేవరకొండ కు సవాల్ విసిరాడు . రేపు మాజీ మంత్రి , యువ నాయకులు కేటీఆర్ పుట్టినరోజు కావడంతో ఈ సవాల్ విసిరాడు . ఒక్క విజయ్ దేవరకొండ కు మాత్రమే కాకుండా దర్శకులు వంశీ పైడిపల్లి అలాగే హీరో నితిన్ , మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత లకు సవాల్ విసిరాడు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ .

ఇంతకీ ఈ సవాల్ ఏంటంటే కేటీఆర్ పుట్టిన రోజున సమాజ హితం కోసం ఏదైనా ఓ మంచి కార్యక్రమం చేయాలనీ పిలుపు ఇవ్వడమే ! కేటీఆర్ అన్న అంటే సంతోష్ కు అమితమైన అభిమానం దాంతో కీసర గుట్ట లోని 2042 ఎకరాల అటవీ భూములలో దత్తత తీసుకున్నాడు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ . ఆ ప్రాంతం మొత్తాన్ని తన సొంత ఖర్చులతో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేసాడు సంతోష్ కుమార్ . ఇక ఈ సవాల్ ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి . మరి విజయ్ దేవరకొండ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి .