మా నాన్నలా నాకు నాలోని టాలెంట్ నిరూపించుకోవాలని వుంది..!!


Akshara Haasan
Akshara Haasan

చియాన్ విక్రమ్ హీరోగా అక్షరా హాసన్‌ హీరోయిన్ గా రాజేశ్‌ సెల్వా దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కడరం కొండాన్‌’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మిస్టర్‌ కేకే’ పేరుతొ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా తన సోదరి శ్రుతి హాసన్‌ విషయంలో జోక్యం చేసుకోనని అక్షర మీడియా సమావేశంలో పత్రికల వారితో అన్నారు.. ‘విక్రమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇందులో నేను నాజర్‌ కుమా రుడు అభి హసన్‌కు జోడీగా నటించా. సినిమాలో నా పాత్ర పేరు అకీరా. ఈ పాత్ర కోసం మా అమ్మ సారిక సూచనలు తీసుకున్నా. ఇది ఛాలెంజ్‌తో కూడుకున్న చిత్రం. విక్రమ్‌ పాత్రలో పరకాయప్రవేశం చేశారు. దర్శకుడు రాజేశ్‌ తనకు కావాల్సిన విధంగా సీన్లు రాబట్టుకునే వారు.. గతంలో అమితాబ్‌తో కలిసి పనిచేశా. అది ఓ మంచి అనుభవం. ఆయన చాలా సపోర్ట్‌ చేశారు. ప్రస్తుతానికి ఏ బాలీవుడ్‌ సినిమాకు సంతకం చేయలేదు. భవిష్యత్తులో దర్శకత్వం వహించాలని ఉంది. ఇందుకోసం రెండు, మూడు కథలు సిద్ధం చేసుకుంటున్నాను. మా నిర్మాణ సంస్థలోనే సినిమాలు తీస్తా. మా నాన్నలా నాకూ నా ప్రత్యేకత, నైపుణ్యాన్ని నిరూపించుకోవాలని ఉంది. ఇక మా అక్క గురించి చెప్పాలంటే నా విషయాల్లో తను, తన విషయాల్లో నేనూ జోక్యం చేసుకోం. కలిసినప్పుడు కూడా సినిమాల గురించి కూడా చర్చించుకోం.. తన వర్కులో తాను బిజీగా ఉంటుంది. నావర్క్ నేను చూసుకుంటాను.. అని క్యూట్ అక్షర ముద్దు ముద్దుగా మాట్లాడింది..!!