మిస్టర్ మజ్ను రివ్యూ


Mr Majnu Movie Review
మిస్టర్ మజ్ను రివ్యూ

మిస్టర్ మజ్ను రివ్యూ :
నటీనటులు : అఖిల్ , నిధి అగర్వాల్
సంగీతం : తమన్
నిర్మాత : భోగవల్లి ప్రసాద్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
రేటింగ్ : 2. 5/ 5
రిలీజ్ డేట్ : 25 జనవరి 2019

అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్ నిర్మించిన చిత్రం ” మిస్టర్ మజ్ను ”. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన మిస్టర్ మజ్ను ఈరోజు విడుదల అయ్యింది . మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

ప్లే బాయ్ లా అమ్మాయిలతో సరదాగా గడిపే విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ ( అఖిల్ ) ని చూసి నిఖిత అలియాస్ నిక్కీ ( నిధి అగర్వాల్ ) ని ప్రేమిస్తుంది . అయితే నిక్కీ ప్రేమని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తాడు విక్కీ . దాంతో నిక్కీ విక్కీ కి దూరంగా వెళ్ళిపోతుంది . నిక్కీ తనకు దూరమయ్యాకే ఆమె గొప్పతనం ఏంటో తెలుస్తుంది విక్కీ కి . దాంతో నిక్కీ ప్రేమ కోసం విక్కీ ఏం చేసాడు ? చివరకు ఇద్దరూ ఒక్కటయ్యారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

అఖిల్
నిధి అగర్వాల్
ఎంటర్ టైన్ మెంట్
తమన్ సంగీతం
విజువల్స్

డ్రా బ్యాక్స్ :

కథ
సెకండాఫ్

నటీనటుల ప్రతిభ :

అఖిల్ ప్లే బోయ్ పాత్రలో అక్కినేని వంశాభిమానులను అలరించాడు . అలాగే తన పాత్రలో పూర్తిస్థాయిలో మెప్పించాడు అఖిల్ . డ్యాన్స్ లలో , ఫైట్స్ లలో కూడా బాగా రాణించాడు . లవర్ బోయ్ పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోయాడు అఖిల్ అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కొద్దిగా తడబడ్డాడు . ఇక నిధి అగర్వాల్ అందాలతో అలరించింది అలాగే నటనతో కూడా ఆకట్టుకుంది . పైగా ఇద్దరి జోడి బాగుంది కూడా . హైపర్ ఆది కామెడీతో అలరించాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు .

సాంకేతిక వర్గం :

దర్శకులు వెంకీ అట్లూరి ఫస్టాఫ్ ని బాగానే ఎంటర్ టైన్ చేసేలా రాసుకున్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి పూర్తిస్థాయిలో రాణించలేక పోయాడు . సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో అలరించాడు కానీ సాగతీతలా సాగింది సెంకండాఫ్ దాంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు . తమన్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు తమన్ . విజువల్స్ బాగున్నాయి , అలాగే నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి .

ఓవరాల్ గా :

ఫస్టాఫ్ మంచి ఎంటర్ టైన్ మెంట్ తో సాగినప్పటికీ సెకండాఫ్ లో కొంచెం బోర్ ఫీలయ్యేలా ఉంది . అయితే అక్కినేని అభిమానులకు , యువతకు ఈ చిత్రం నచ్చడం ఖాయం …… కానీ అఖిల్ మాత్రం సాలిడ్ హిట్ మళ్ళీ కొట్టలేక పోయాడు .

English Title: Mr Majnu Movie Review

                               Click here for English Review