క్రిస్మస్ కానుకగా ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్


 Mr. Majnu Title song releasing Tomorrow
Akhil Akkineni

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న  ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. శ్రీమణి అద్భుతమైన సాహిత్యానికి థమన్ అందించిన వీనుల విందైన సంగీతం తోడవడంతో ఈ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇక రెండో పాటను డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా సాయంత్రం 6 గంటలకు ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు.

అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

English Title: Mr. Majnu Title song releasing Tomorrow