`బాహుబ‌లి` స్ఫూర్తితో మ‌రో భారీ చిత్రం వ‌చ్చేస్తోంది!

`బాహుబ‌లి` స్ఫూర్తితో మ‌రో భారీ చిత్రం వ‌చ్చేస్తోంది!
`బాహుబ‌లి` స్ఫూర్తితో మ‌రో భారీ చిత్రం వ‌చ్చేస్తోంది!

రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబ‌లి` అనూహ్య విజ‌యాన్ని సాధించి లార్జ‌ర్‌దెన్ లైఫ్ చిత్రాల‌కు బంగారు బాట‌లు వేసింది. భారీ స్పాన్ వున్న క‌థ‌లు మ‌న వాళ్ల ద‌గ్గ‌ర వున్నా మార్కెట్ ప‌రిధి ప‌రిమితంగా వుండ‌టంతో పెట్టిన డ‌బ్బు తిరిగి రాబ‌ట్టుకోవ‌డం క‌ష్టం అని భావించి భారీ చిత్రాలు నిర్మించాడానికి సాహ‌సించ‌లేదు. అయితే `బాహుబ‌లి` ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్లు సాధించి కొత్త ఆశ‌ల్ని చిగురింప‌జేసింది. దాంతో ఎన్నో ఏళ్లుగా భారీ స్పాన్ వున్న చిత్రాల్ని నిర్మించాల‌ని ఎదురుచూస్తున్న చాలా మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆ త‌ర‌హా చిత్రాల్ని నిర్మించ‌డానికి ముందుకు రావ‌డం మొద‌లైంది.

ఈ కోవ‌లో మ‌ల‌యాళం నుంచి వ‌స్తున్న చిత్రం ‘మ‌ర‌క్కార్’. `అర‌బిక‌డ‌లైంట్ సింహం` అని ఉప‌శీర్షిక‌. సూప‌ర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా న‌టిస్తున్నారు. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కిస్తున్నారు. వంద కోట్ల‌కు మించి ఖ‌ర్చు చేస్తున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యాన‌ర్‌పై ఆంటోని పెరంబవూర్ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అతిథి పాత్ర‌ల్లో మోహ‌న్‌లాల్ త‌న‌యుడు ప్ర‌ణ‌వ్ మోహ‌న్‌లాల్‌, ప్రియ‌ద‌ర్శ‌న్ కూతురు క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ న‌టిస్తున్నారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, సుదీప్‌, మంజు వారియ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

తెలుగు, త‌మిళ‌, మల‌యాళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 26న రిలీజ్ చేయ‌బోతున్నారు. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా హీరో మోహ‌న్‌లాల్ ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు. మ‌ర‌క్కార్ గెల‌ప్‌లో గుర్రంపై మోహ‌న్‌లాల్ క‌నిపిస్తున్నతీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. కాగా ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా 5000 స్క్రీన్ల‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ని తెలిసింది.