రియ‌ల్ హీరోకు ముంబై హైకోర్టు షాక్‌!

రియ‌ల్ హీరోకు ముంబై హైకోర్టు షాక్‌!
రియ‌ల్ హీరోకు ముంబై హైకోర్టు షాక్‌!

లాక్‌డౌన్ స‌మ‌యంలో రియ‌ల్ హీరోగా అవ‌త‌రించిన సోనుసూద్‌కు ముంబై హైకోర్టు తాజాగా షాకిచ్చింది. బృహ‌న్ ముంబై కార్పొరేష‌న్ తన హోట‌ల్ విష‌యంలో ఇచ్చిన నోటీసుల‌ని సవాల్ చేస్తూ సోనుసూద్ ముంబై హైకోర్టుని ఆశ్ర‌యించారు. అయితే సోను దాఖ‌లు చేసిన పిటీష‌న్‌‌ని ముంబై హై కోర్టు కొట్టివేసింది.  జుహూలోని ఆరంత‌స్తుల భ‌వ‌నాన్ని ఎలాంటి అనుతులు లేకుండా హోట‌ల్‌గా మార్చారంటూ బీఎంసీ అధికారులు సోనుసూద్‌కు నోటీసులు పంపించారు.

దీంతో ఆ నోటీసుల‌ని సవాల్ చేస్తూ సోనుసూద్ ముంబై హైకోర్టుని ఆశ్ర‌యించారు. విచార‌ణ అనంత‌రం న్యాయ‌మూర్తి పృధ్వీరాజ్ చౌహాన్ పిటీష‌న్‌ని కొట్టివేశారు. అంతే కాకుండా బీఎంసీ అధికారులు నోటీసులు అందించిన వెంట‌నే స్పందించాల్సింది. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంద‌ని, త‌మ చేతుల్లో ఏమీ లేద‌ని వెళ్లి బీఎంసీ అధికారుల‌నే సంప్ర‌దించాల‌ని న్యాయ‌మూర్తి సోనుసూద్‌కు సూచించారు.

గ‌తంలో కంగ‌న ఇంటి విష‌యంలోనూ బీఎంసీ అధికారుల‌కు కంగ‌న కు తారా స్థాయిలో గొడవ జ‌రిగి అది మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేదాకా వెళ్లిన విష‌యం తెలిసిందే. తాజాగా సోనుసూద్‌, బీఎంసీ అధికారుల వివాదం కూడా రాజ‌కీయ రంగు పులుముకునేలా క‌నిపిస్తోంద‌ని, ఇటీవ‌లే సోనుసూద్ సీనియ‌ర్ నేత శ‌ర‌ద్‌ప‌వార్‌ని క‌ల‌వ‌డం ఇందులో భాగ‌మ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.