బ‌న్నీ గెట‌ప్ కోసం బాలీవుడ్ టీమ్‌!


బ‌న్నీ గెట‌ప్ కోసం బాలీవుడ్ టీమ్‌!
బ‌న్నీ గెట‌ప్ కోసం బాలీవుడ్ టీమ్‌!

టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్‌గా బ‌న్నీకి మంచి పేరుంది. అందుకు త‌గ్గ‌ట్టే ఏ స్టైల్ వ‌చ్చినా దాన్ని ముందుగా సినిమాల్లో చూపించాల‌ని అల్లు అర్జున్ త‌పిస్తుంటారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సిక్స్ ప్యాక్‌ని ప‌రిచ‌యం చేసిన బ‌న్నీ ఆ త‌రువాత త‌న‌దైన స్టైల్స్‌ని ప‌రిచ‌యం చూస్తూనే వున్నాడు. ఇటీవ‌ల `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోనూ కొత్త లుక్‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు బ‌న్నీ.

మాస్ లుక్‌తో పాటు క్లాస్ లుక్‌లోనూ ఆక‌ట్టుకున్న బ‌న్నీ త‌న త‌దుపిరి చిత్రంలొ మాత్రం మ‌రింత కొత్త‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఇందు కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. స్టైల్స్‌కి అడ్డా అయిన బాలీవుడ్ నుంచి త‌న కోసం కొత్త‌గా ఓ టీమ్‌ని ర‌ప్పిస్తున్నాడ‌ట‌. మేక‌ప్‌, హెయిర్ స్టైలిస్ట్‌ల‌ని ప్ర‌త్యేకంగా ముంబై నుంచి బ‌న్నీ దిగుమ‌తి చేసుకుంటున్న‌ట్టు తెలిసింది.

అల్లు అర్జున్ త్వ‌ర‌లో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ పూర్త‌యింది. తాజా షెడ్యూల్‌ని త్వ‌ర‌లో మొద‌లుపెట్ట‌బోతున్నారు. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా బారు గ‌డ్డం, గుబురు మీసాల‌తో క‌నిపించ‌బోతున్నాడు. ఈ లుక్ కోసం బాలీవుడ్ టీచ్ వ‌ర్క్ చేయ‌బోతోంద‌ట‌. తాజా షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతుండ‌టంతో బాలీవుడ్ టీమ్‌ని వున్న‌ప‌లంగా బ‌న్నీ దించేస్తున్నాడ‌ట‌. లుక్ విష‌యం బ‌న్నీకే వ‌దిలేయ‌డంతో దీనిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తీసుకుని భారీగానే ఖ‌ర్చు చేస్తున్నాడ‌ట బ‌న్నీ.