అల వైకుంఠపురములో హైలైట్ అవ్వనున్న మురళీ శర్మ


అల వైకుంఠపురములో హైలైట్ అవ్వనున్న మురళీ శర్మ
అల వైకుంఠపురములో హైలైట్ అవ్వనున్న మురళీ శర్మ

అతిథి సినిమాతో విలన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మురళీ శర్మ నేడు టాలీవుడ్ బిజియస్ట్ స్టార్స్ లో ఒకరు. ఈరోజు, రేపు దాదాపు తెలుగు సినిమాలో మురళీ శర్మ కనిపిస్తున్నారంటే ఆయన ఎంత బిజీ అయిపోయారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం మేకింగ్ లో ఉన్న రెండు బడా చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.. ఈ రెండు చిత్రాల్లో మురళి శర్మ కీలక పాత్రలు పోషిస్తుండడం విశేషం. ముఖ్యంగా అల వైకుంఠపురములో లో మురళీ శర్మ పాత్ర చాలా ప్రధానమైనదిగా, ప్రాముఖ్యత కలదిగా తెలుస్తోంది. ఇందులో మురళీ శర్మ కోటీశ్వరుడి ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్ ఫాథర్ గా కూడా కనిపించనున్నాడు. చాలా స్ట్రిక్ట్ ఫాథర్ గా కనిపిస్తారని, అదే ఇందులో ఫన్ ఎలిమెంట్ అని తెలుస్తోంది. మిడిల్ క్లాస్ వ్యక్తిగా, విలువలు ఉన్న వ్యక్తిగా మురళీ శర్మ పాత్రను తీర్చిదిద్దాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈరోజు విడుదలవుతున్న ఓ మై గాడ్ డాడీ కూడా మురళీ శర్మను ఉద్దేశించి అల్లు అర్జున్ పాడే పాటగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఇక ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు అల వైకుంఠపురములో చిత్రంలోని మూడో పాట ఓ మై గాడ్ డాడీ విడుదలవబోతోంది. ఇప్పటికే ఈ పాట ప్రోమోకు విశేష స్పందన లభించింది. మరి పూర్తి పాట ఎలా ఉండబోతోందో, మొదటి రెండు పాటల తరహాలో ఇది కూడా చార్ట్ బస్టర్ అవుతుందో లేదో తెలియాలంటే ఈరోజు సాయంత్రం దాకా వేచి చూడాల్సిందే.

అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో నివేద పేతురాజ్, సుశాంత్, నవదీప్, సునీల్, మురళీ శర్మ, టబు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపోయించబోతున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా చినబాబు, అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల వైకుంఠపురములో జనవరి 12న విడుదల కానుంది.