వై ఎస్ జగన్ పై హత్యాయత్నం


Murder attempt on ys jagan

ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగింది. ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్ రేపు శుక్రవారం కావడంతో ఈరోజు హైదరాబాద్ బయలుదేరాడు. ప్రతీ శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు కి జగన్ హాజరు కావల్సి ఉంది దాంతో ప్రజా సంకల్ప యాత్ర చేస్తూనే ప్రతీ గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటున్నాడు. రేపు ఎలాగూ శుక్రవారం కాబట్టి కోర్టు కి వెళ్ళడానికి ఈరోజు విశాఖ లోని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాడు. అయితే జగన్ తో సెల్ఫీ కోసం ప్రయత్నించిన శ్రీనివాస్ అనే వ్యక్తి పందెం కోడి కి వాడే పదునైన కత్తి తో జగన్ పై దాడికి పాల్పడగా జగన్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

భుజానికి స్వల్ప గాయం అయ్యింది. అయితే అది విషం తో కూడిన కత్తి అయితే ప్రమాదం కనుక వెంటనే ప్రాథమిక చికిత్స తీసుకున్నాడు జగన్ . ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగింది అన్న విషయం క్షణాలలో పార్టీ శ్రేణులకి తెలియడంతో పెద్ద ఎత్తున జగన్ ని చూసేందుకు ఎగబడ్డారు. అలాగే ఇతర చోట్ల ఆందోళనలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై హత్యాయత్నం ఒక్కసారిగా రాజకీయ వేడి పుట్టేలా చేసింది. రాస్తా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రస్తుతం జగన్ క్షేమంగా ఉన్నాడు. దాంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

English Title: Murder attempt on ys jagan