మురుగదాస్ మళ్ళీ తెలుగు సినిమా చేస్తున్నాడా?


 

Murugadoss talks about ntr project
Murugadoss talks about ntr project

మురుగదాస్.. సౌత్ ఇండియాలోనే ప్రముఖ దర్శకుడు. కమర్షియల్ ఫార్మాట్ లోనే సోషల్ మెసేజ్ ను కలగలిపి సినిమాలు చెప్పడం ఆయనకే చెల్లింది. రమణ, గజినీ, తుపాకీ, కత్తి వంటి సినిమాలతో మురుగదాస్ తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. తమిళ సినిమాల వరకూ మెప్పించి సినిమాలు తీయగల మురుగదాస్ హిందీలోనూ హిట్లు కొట్టాడు. తను తీసిన గజినీ, తుపాకీ చిత్రాలను హిందీలో తీసి సక్సెస్ సాధించాడు. అయితే తెలుగులో కూడా రెండు సినిమాలు చేసాడు మురుగదాస్. అయితే అవి మాత్రం ప్లాపులుగా మిగిలాయి. చిరంజీవితో స్టాలిన్ చేసిన మురుగదాస్ కంటెంట్ పరంగా పర్వాలేదనిపించినా సక్సెస్ కొట్టలేకపోయాడు. ఈ సినిమా బిలో యావరేజ్ సినిమాగా నిలిచింది. ఇక మహేష్ బాబుతో చేసిన స్పైడర్ అయితే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో మళ్ళీ తమిళ సినిమాలపైనే దృష్టి పెట్టాడు.

ప్రస్తుతం రజినీకాంత్ తో దర్బార్ చేసాడు మురుగదాస్. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్ గానే ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మురుగదాస్ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. గత కొంత కాలంగా ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ తో మురుగదాస్ సినిమా చేయబోతున్నాడని తెలుగు మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై స్పందిస్తూ అలాంటిదేమి లేదని, ప్రస్తుతం తన దృష్టి అంతా దర్బార్ రిలీజ్ పైనే ఉందని, ఇంకా తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాడు.

దర్బార్ రిలీజ్ అయ్యాక తన తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తానని, కనీసం స్క్రిప్ట్ కూడా ఏం అనుకోలేదని అంటున్నాడు. అదే సమయంలో ఎన్టీఆర్ కు కథ చెప్పానని, అయితే అది గతంలో జరిగినదని అన్నాడు. ఇప్పుడు అందరి దృష్టి గతంలో తారక్ కు మురుగ చెప్పిన కథ ఏదై ఉంటుందా అని ఆరాలు తీస్తున్నారు.