రోడ్డు యాక్సిడెంట్ లో సింగర్ కూతురు మరణం


Music director balabhaskar child dies in car accident

మలయాళ చిత్ర సంగీత దర్శకుడు బాలభాస్కర్ ప్రయాణిస్తున్న కారు చెట్టుకి వేగంగా గుద్దుకోవడంతో అక్కడికక్కడే అతడి కూతురు చిన్నారి తేజస్వి (2) మరణించింది . అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కన్నకూతురు కళ్ళ ముందే చనిపోవడంతో తీవ్ర షాక్ కి గురయ్యారు బాలభాస్కర్ దంపతులు . రోడ్డు యాక్సిడెంట్ లో వాళ్లకు కూడా తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన తిరువనంతపురం దగ్గరలోని పల్లిపురం రోడ్డు లో జరిగింది .

త్రిస్సూర్ లోని దేవాలయానికి తెల్లవారుఝామున వెళ్లి దైవదర్శనం చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో అత్యంత వేగంగా వెళ్తూ ఓ చెట్టుని ఢీకొట్టింది కారు . డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్న సమయంలో ఈ ఘోర సంఘటన జరిగింది . చెట్టుకి ఒక్కసారిగా కారు గుద్దుకోవడంతో బాలభాస్కర్ కూతురు చిన్నారి తేజస్వి వెంటనే మరణించింది . మళయాలంలో పలు చిత్రాలకు సంగీతం అందించిన బాలభాస్కర్ సింగర్ కూడా అయితే బాలబాస్కర్ తో పాటు అతడి భార్య లక్ష్మి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం ఆసుపత్రిలో ఐ సి యు లో చికిత్స పొందుతున్నారు .

English Title: Music director balabhaskar child dies in car accident